01-09-2012
బిడ్డల ఎదుగుదల పుట్టిన అప్పటి నుంచి అంచెల వారీగా జరుగుతుంది. అందులో తొలి అయిదు ఏళ్ళు బిడ్డ దాదాపు ఇంటికే పరిమితం కాగా మలి అయిదు ఏళ్ళలో ఇంటి నుంచి సమాజం లోకి వచ్చే అంచె. అంటే బయటి ప్రపంచం లోకి తొంగి చూడటానికి ఇది తొలి మెట్టు. బిడ్డలను విద్యా వంతులుగా తీర్చిదిద్దటంలో తొలి విద్యకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రాథమిక విద్య అంటే కేవలం చదవటం, రాయటం నేర్చు కోవటమే కాదు. బిడ్డ మొత్తం ఎదుగుదలకు పునాది వేయటం, ఇంట్లోనుంచి సమాజంలోకి మళ్లించటం. ఈ అంచెలో బిడ్డ తన గురించి, తన కుటుంబాన్ని గురించి, చుట్టూ ఉన్న సమాజం, పరిసరాలను గురించి తెలుసు కోవాలి. సమాజపు నియమాలూ, జనంతో సంబంధాల గురించి తెలుసు కోవాలి. ఈ అంచెలో అందించే విద్యలో బిడ్డ ఎదిగాక ఏమి అవుతారు అనే దానితో సంబంధం లేకుండా ఉండాలి. తొలి విద్య పూర్తి అయ్యే నాటికి బిడ్డకు ఈ కింద సంగతుల పయిన కనీసం అవగాహన పొంది ఉండాలి.
- తన సొంత భాషను బాగా మాట్లాడటం, చదవటం, రాయటంలో పట్టు కలిగి ఉండాలి.
- ఇతరుల నుండి, ప్రసార సాధనాల నుంచి (రేడియో, టీవీ, పత్రికలు, సినిమాలు) పొందే సమాచారాన్ని విని అర్థం చేసుకో గలిగి ఉండాలి.
- అర్థం చేసుకొనేటి అప్పుడు అసమగ్రంగా తోచిన వాటి గురించి స్వేచ్ఛగా, సంకోచం లేకుండా అడిగి చెప్పించుకో గలగాలి.
- ఇతరులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకో గలిగి, వాటికి బదులు, వివరణలు ఇవ్వ గలగాలి.
- తన భావాలను, ఉద్వేగాలను స్వేచ్ఛగా తెలియ జేసే మెళకువలు ఉండాలి.
- తనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో స్వేచ్ఛగా రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ పంచుకో గలగాలి.
పయి సంగతులను ఒక సారి బాగా పరికించి చూస్తే అవి అన్ని భాషతో జరగాల్సిన పనులు. భాష నేర్చు కోవటమే కాకుండా దాన్ని ఉపయోగించి సమాజంతో మమేకం అవుతూ ఆ మెళకువలను నేర్చుకోవాలి. బడి విద్య, సమాజం అందించే ఎఱుకువ (నాలెడ్జి)కు కొనసాగింపే కాని ప్రత్యామ్నాయం కాదు. విద్యలో నేర్పించే సంగతులు సమాజం లోనివిగా ఉండాలి. అప్పుడే బిడ్డలు చదివిన వాటిని సమాజంతో సమన్వయ పరచుకొని ఎదుగుతారు. చదివే సంగతులతో పిల్లలకు సంబంధం లేక పోయినా, చెప్పేది అర్థం కాకపోయినా వాటిని సరిగా అరిగించు కోలేరు. అందువల్ల పుస్తకాలలో ఉన్న సంగతులు బుర్రలోకి దూరేది తక్కువ. పిల్లలకు భాష పయిన పూర్తి పట్టు రాకుండా చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంగ్లీషు మీడియంలో నాలుగు లేదా అయిదో తరగతి చదివే మీ పిల్లల చేత "Magic pot'' వార ఫత్రికలో అచ్చు అయిన ఈ సరళ కథను చదివించండి లేదా మీరే చెప్పండి. తెలుగులో దాని అర్థం చెప్పొద్దు.
Long long ago, A proud woodpecker called Woody living in a forest. He always frightened small animals and birds by saying ""Hey! Don't you dare come near me! I will peck you with my sharp beak!'' At times, in a fit of anger, he actually pecked some small birds hard with his beck. No one wanted to be friends with Woody because they were afraid of being pecked.
One day, as Woody sat on a jack fruit tree, he proudly pecked a huge, jack fruit. But alas! He did't know that he had pecked an unripe jack fruit! The sticky sap from the fruit oozed out, and stuck Woody's beak. He couldn't open his mouth! Woody flew through the jungle with his upper and lower beak stuck together. The other animals and birds in the forest made fun of him. Woody hung his head in shame the flew away quickly.
కథ పూర్తి అయిన తరువాత తిరిగి ఆ కథను ఇంగ్లీషులోనే వారి సొంత తీరులో చెప్పమనండి. ఎంత మంది చెబుతారో చూడండి. ఆ కథ మీద చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. ఎలా చెబుతారో చూడండి. దాదాపుగా చెప్పలేరు. తరవాత ఇదే కథను తెలుగులో చెప్పండి. కథ చెప్పటం పూర్తి అయ్యాక తిరిగి చెప్పమని అడగండి. పిల్లలు ఖచ్చితంగా చెప్పగలరు. కథ మీద ప్రశ్నలు వేయండి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీలు పడి మరీ బదులు చెపుతారు. అబ్బుర పరచే కొస మెలిక ఏమిటి అంటే పయి కథ ఇంగ్లీషు మీడియంలో చదివే పదో తరగతి పిల్లల్లో నూటికి 65 మందికి అర్థం అయితే ఒట్టు. అదీ మన చదువుల డొల్లతనం.
No comments:
Post a Comment