మన తెలుగు అచ్చరాలలో సగం మనవి కావు! అవును ఇది నిప్పులాంటి నిజం. తెలుగు 'అక్షరాలు' 54 అని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పించారు. మనకే కాదు మన తల్లి తండ్రులకు, తాతలకు, ముత్తాతలకు, వారి ముత్తాలకు తరతరాలుగా అలాగే నేర్పించారు. నేర్పించే అయ్యోర్లకు కూడా తెలియకుండానే అలా అని మనకు నేర్పించారు. మన నుడి గురించి మనకు తెలియనంతగా, తెలుసుకోలేని అంత చాక చక్యంగా కుట్ర చేసి 29 అచ్చరాలుగా ఉన్న కమ్మనయిన తెలుగు పలుకులకు 26 సంస్కురతపు "అక్షరాలు" కలిపి మొత్తం 56 'అక్షరాలు'గా చేసి దానికి 'ఆంధ్రము' అని పేరు పెట్టినారు. దాని వల్ల తేనెలు ఊరే తెలుగు తనం పోయి తాటి బెల్లం కలిపి చేసిన వగరులా తెలుగు తయారు అయ్యింది.
తెలుగు గురించి తెలుగు వారికి తెలియకుడా "దాపిరికం (secrete) గా పరాయి నుడి నుంచి అచ్చరాల చొరబాటు ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు జరిపారు? నుడి చొరబాటు వల్ల తెలుగు జాతి ఏమి పోగొట్టుకుంది? మన నుడి, మన పలుకు, మన నుడి ఆచారాలు ఏమయాయి? ఎక్కడ పాతి పెట్టారు? అనేవి తెల్లం కావాలంటే మనం చిన్నపుడు నేర్చుకున్న తప్పుడు తెలుగు ''వర్ణమాల"తో మొదలు పెట్టాలి. తెలుగు పేరుతో ఇప్పుడు అమలులో ఉండే "అక్షర మాల" పట్టిక ఇది;
అచ్చులు (16 ):
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు ( 36 ) :
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ డ ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
16 అచ్చులు, 36 హల్లులు కలిపి మొత్తం 52 అక్షరాలు తెలుగు "వర్ణ మాల"గా మనం నేర్చుకుంటున్నాము. నిజానికి ఇది అసలయిన తెలుగు పలుకుకుల పట్టీ కాదు. ఇందులో తెలుగు "పలుకులు" + సంసుక్రుతపు "అక్షరాలు" కలిసి ఉన్నాయి. గమనించండి.
అచ్చులు (16 ):
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు ( 36 ) :
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ డ ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
ఎరుపు రంగులో ఉన్నా"అక్షరాలు అంటే అచ్చులలో ఐ, ఔ , ఋ, ౠ కః మన తెలుగు పలుకులు కావు. అలాగే హల్లులలో క చ ట త ప లు, గ జ డ ద బ లు న మ లు మాత్రమే తెలుగు పలుకులు. మిగిలిన ఖ ఛ ఠ థ ఫ లు ఘ ఝ ఢ ధ భ లు ఙ ఞ ణ లు, శ ష హ క్ష అనే "అక్షరాలు" తెలుగు పలుకులు కావు. తెలుగులో కలితీ అయిన "అక్షరాలు"
మరయితే అసలు తెలుగు పలుకులు ఏమిటి అని తరచి చూస్తే, తేట తెలుగు పలుకుల పట్టిక ఇది: .
అచ్చులు (10) :
అ ఆ
ఇ ఈ
ఉ ఊ
ఎ ఏ
ఒ ఓ
అల్లులు (19) :
క గ
చ జ
ట డ
త ద న
ప బ మ
య ర ల వ స ళ ఱ
తెలుగు పలుకులలో కేవలం 10 అచ్చులు, 19 అల్లులు మాత్రమే ఉంటాయి. అసలు తెలుగు పలుకులు చాల తేలికాగా ఉంటాయి. అలవోకుగా పలకటానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో ఒత్తుతనం, అదిమి పలికే అవసరం ఉండదు. అందుకే తెలుగు నుడి మాటాడుతూ ఉంటే తేలికగా, కమ్మగా ఉంటుంది. సెల యేటి గల గలలా వినసొంపుగా ఉంటుంది. కాబట్టే తేట తెలుగు తేనే తెలుగు అయ్యింది. అలాంటి తెలుగు పలుకులలో సంసుక్రుతపు "అక్షరాలు" చేరటం వల్ల తెలుగు తన సొబగులు పోగొట్టుకొని 'ఘోష'లా తయారు అయింది. దీని వల్ల తెలుగు నుడి ఏమి పోగొట్టుకున్నది అన్నది చూస్తే,
- తన అసలు తనాన్ని పోగొట్టుకుంది.
- నిండా కలితీ నుడిగా తాయారు అయినది
- లేతదనము పోగొట్టుకొని కరుకుగా తయారు అయినది.
- పాడి (Standard) నుడిగా ఎదగ లేక పోయింది.
- తక్కువ పలుకులు (29) ఉండటం అనేది 'లెక్కిణి' (computer) నుడిగా వాడటానికి చాల అనుకూలం అయినది. ఒక అంచనాను బట్టి ఇంగిలీసు తదితర పడమటి (అయిరోపా) నుడుల తరువాత తూరుపున 'లెక్కిణి'నికి అనువయిన నుడిగా ఉండేది. "భారత దేశం"లో లెక్కిణికి కుదరగలిగే ఒకే ఒక్క నుడిగా ఎదిగేది. ఇప్పుడు ఆ చోటులో తమిళ నుడి ఉంది.
- 29 తేట తెలుగు "పలుకుల"కు 23 పరాయి నుడి అక్షరాలు కలిపి 54 "అక్షరాల"ను చేయటం వల్ల చిక్కు నుడిగా మారినది.
తెలుగు నుడి పాలలో మురికి నీళ్ళు కలిపి కలితీ చేయాలిసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు చేసారు? ఎప్పుడు చేసారు? దానివల్ల మనం ఏమి పోగుట్టుకున్నాం? అనే సంగతులను తెలుగు వారు అందరు తెలుసుకోవాలి. రాబోయే తపాలలలో వాటి గురించి చూద్దాం.
Our teacher told us this in 5th class sir.
ReplyDeleteThe borrowing of sanskrit alphabet has a purpose..
computers were not there nor anticipated when the language and alphabet was adopted for " poetic sweetness"
Interesting!
ReplyDeleteCan you please provide reference for the same, if any?
చైతు గారూ,
ReplyDeleteఈ సంగతి తెలుగు పండితులు, తెలుగు ప్రోఫెసర్లుగా చలామణి అయ్యే వారందరికీ తెలుసు. కాని బయటకు చెప్పరు. కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. నిజంగా ఆ పండితుడికి ఏమి తెలియక పోవటం, రెండోది తెలిసినా బయటకు చెప్పక పోవటం. మొదటి వారిది అమాయకత్వం రెండో వారిది వారసత్వపు కుట్ర కొనసాగింపు.
రెఫరన్సు పుస్తకాలు:
1 . తెలుగా ?ఆంధ్రమా? రచయిత- వాగారి ప్రచురణ: ఆర్ట్స్ అండ్ లెటర్స్, హైదరాబాద్
2. మన తెలుగు, రచయిత - డా. చంద్ర శేఖర రెడ్డి
3. నుడి నానుడి(1960) రచయిత- బి. స బంగారయ్య. ఇది నాదగ్గర ఒకే ఒక కాపి ఉంది. మార్కెట్లో దొరకదు. ఈ పుస్తకాని నడుస్తున్న చరిత్రలో గత ఏడాదిగా వరుసగా అచ్చు వేస్తున్నారు. ఈ నెలతో అయిపొయింది. తొందరలో పుస్తక రూపంలో వస్తుంది.
Answer to first comment: మీ టీచరు సరుకు ఉన్నా అయ్యవారు కాబట్టే మీకు చెప్పగలిగారు మంచిది. వినసొంపు అయిన కవిత్వం కోసం ఇతర నుడి రాతలను తమ నుడి లోకి దిగుమతి యింత వరకు ఏ నుడిలోనూ జరగలేదు. మరి తెలుగులోకి ఎందుకు తేవాలి? అయినా సంస్క్రుతము తెలుగుకన్నా కావ్య నుడి అని ఏ పండితుడు చెప్పాడూ?
ReplyDeleteee వారసత్వపు కుట్ర కొనసాగింపు emito konchem vivaristharaaa??
ReplyDeleteబంగారయ్య గారి నుడి నానుడి నా వద్ద కూడా ఉందండి! కానీ అందులోని పదాలు కొన్ని నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. ఇవి తెలుగు పదాలేనా అని? అంతగా ఇతర భాషల వల్ల తెలుగు ప్రభావితమైందా అని !
ReplyDeleteముమ్మాటికి తెలుగు పదాలేనమ్మ. ఇక తెలుగు పై ఇతర నుడుల ప్రభావం అంతా అంతా ఇంత కాదమ్మా బోలెడంత. అయితే అన్నీ నుడులకు మల్లె సాజం (Natural)గా జరగ లేదు. పనికట్టుకొని జరిపించారు. తెలుగా ఆంధ్రమా లో మీరు ఈ పాటికే చదివి ఉంటారు అనుకుంటా రాబోయే తపాలాలలో వివరంగా రాస్తాను
ReplyDeleteViswanath gaaru, రాబోయే తపాలాలలో వివరిస్తానండి
ReplyDeleteదీనిలో తప్పేమిటో నాకు అర్ధం కావటల్లేదు. భాష ఎరుగుదలకి ఇంకో భాష నుండి కావాల్సినవి తెచ్చుకుంటుంది. ఇంగ్లిష్ భాష అల్లాగే పెరిగింది. మనము రోజూ వాడే కంప్యూటర్ తయారు చెయ్యటానికి కావాల్సిన లాజిక్ సంస్కృత గ్రామర్ నుండి వచ్చింది. చైనీస్ జపనీస్ అక్షరాలు మనకన్నా ఎక్కువ. వాళ్ళూ కంపూటర్లు ఉపయోగిస్తున్నారు బాగానే. తెలుగు భాష మనము మాట్లాడే శబ్దం మీద ఆధార పడి (Phonetics based) ఉన్న దని నేర్చుకున్నాను. అందుకనే మనము ఏవిధంగా మాట్లాడుతామో ఆవిధంగానే వ్రాస్తాము. కొత్త శబ్దాలు వ్రాయటానికి అక్షరాలు లేక పోతే create చెయ్యటమో లేక ఇంకో చోటునుండి తెచ్చు కోవటమో జరుగుతుంది. దానిలో తప్పేముంది.
ReplyDeleteమీ అనిపింపులకు బదులు "పరాయి" మాటలు తెలుగు నుదికారంలోనే పలకాలి" అనే బ్లాగులో రాసాను చూడండి.
Deleteమరో గమనిక: "రోజూ వాడే కంప్యూటర్ తయారు చెయ్యటానికి కావాల్సిన లాజిక్ సంస్కృత గ్రామర్ నుండి వచ్చింది" అన్నరు. ఇది ఉత్త పుకరే తప్ప నిజం కాదు. అసలు సంస్క్రుతాన్ని ఉపయోగించి కంప్యూటరు ప్రోగ్రామింగు తాయారు చేసారనే పెద్ద అబద్దం కూడా ప్రచారములో ఉంది.
This comment has been removed by the author.
ReplyDeleteడా. అద్దంకి శ్రీనివాస్ గారు ఆంధ్రభూమి లో నుడి అను శీర్షిక లో వాడిని లేదా వాడ్ని అనేవి తప్పు వాడుకాలని ,వాణ్ని అనేది సరైన వాడుక గా రాసిండ్రు.దీని గురించి తమ అనిపింపు ఏమిటో చెప్పగలరు.
ReplyDeleteబాగుంది,
ReplyDeleteఏమో !! ఎంతైనా ఆంధ్రమే నా మాతృభాష !!
మీరు ఇక్కడ చెప్తున్నది నిజమే అయినప్పటికీ
56 అక్షరాలూ ఉంటేనే పూర్ణంగా అనిపిస్తున్నది.
ఆ సంస్కృత మేళవింపు లేని అక్షర మాలను ఊహింపజాలకున్నాను.
మీ విషయ ప్రతిపాదనా తీరు బాగున్నది.
మరి కొన్ని పోస్టులను కూడా చూశాను మీ బ్లాగు ఇన్నాళ్ళు ఎందుకు చూడలేదా అనిపించింది.
చక్కని అంశాలను పంచుతున్నారు,
కృతజ్ఞతలు
'ణ' అచ్చ తెలుగు అక్షరమే, ఇంకా పలుకుబడి లో కూడ ఉంది
ReplyDeleteవణుకు, బెణుకు,అణకువ వంటిvi