Friday, August 3, 2012

తేట తెలుగు మాటలు



తేట తెలుగు మాటలను వాడదగిన చోట కూడా సంస్కృత సమములను వాడడం మన పండితులు, కవులు, రచయితల అలవాటు చేశారు. ఇందువల్ల చక్కని తెలుగు మాటల్ని వాడుకలోంచి మెల్లమెల్లగా పోగొట్టుకొంటున్నాం. ఉదాహరణకు కొన్ని మాటల్ని ఇక్కడ చూడండి.


సంస్కృతసమం              తేటతెలుగు

అసహ్యం         ..........          ఈసడింపు

సామూహికం    ..........          ఉమ్మడి
 
జన్మస్థలం       ........             పుట్టిన ఊరు

నిష్క్రమించు     .......             తొలగు

శతాబ్దం            .......             నూరేడు

ధ్యేయం            .......            ఉల్లనం

సందిగ్ధం            .......            ఊగిసలాట

నవ్యధోరణులు     .......          కొత్తపుంతలు

మార్గం             .......            దారి

ప్రభువు           .......             ఏలిక

అంగీకారం,       .......             సమ్మతి, ఒప్పుకోలు

ఉద్యమం          .......            కదలింపు

యత్నించు        .......           కడంగు, పూనుకొను

గళం                .......           గొంతు

నాళిక             .......            గొట్టము

సమూహం/
బృందం,            .......          గుంపు

లక్ష్యం               .......         గురి

స్థాయి, స్థితి       ........         మట్టు (మట్టు మర్యాద status and respect )

పరిస్థితి                ......        పరిమట్టు

ఉన్నతస్థాయి,      .......        పయి మట్టు, ఎగువ మట్టు,

శక్తి, దారుఢ్యం      .......         పస, చేవ

ఉత్సవం            ........         పండుగ

బ్రహ్మోత్చావం                    తిరునాళ్ళు

ప్రామాణికం       ........          పాడి (పదుగురాడు మాట 'పాడి'అయి ధరజెల్లు...) 
                                        పడి (తూకం లో వాడే 'పడి' కట్టు, మాటల్లో వాడే  'పడి' కట్టు పదాలు  )

పూజ                 .......         కొలుపు, 

దేవాలయం        ........          గుడి 

విద్యాలయం       .........       బడి 

నివాసం, స్థానం         ........ నెలవు

ఉదాహరణ               ..... ... మచ్చు

అధికం, బహు           .. ...... పెక్కు


ఉపాధ్యాయుడు         .  .....  వాతేరు

మనసు                 ...  ......  ఉల్లము

ఆలోచన              .....   ...    తలపోత  ఎన్నం

దృష్టి                    .....    ..    చూపు 

కరదీపిక             .....    ....    చేతిక

విషయం      .............            సంగతి

సంక్షిప్త   ...................           పొట్టి

విస్తృత అధ్యయనం....    .     లోతుచదువు

సమగ్ర అధ్యయనం ......   ... విరివి చదువు


 ....................................  ఇంకా మీకు తోచిన  తెలుగు  పలుకులను కొన్నింటిని తలపోయండి 

5 comments:

  1. శ్రీనివాస తేజగారూ..!
    నమస్తే..!
    ఆంధ్రభూమి "నుడి" మీ వ్యాసపరంపర చాలా బాగున్నది.

    ఈ వ్యాసం దగ్గరికొస్తే, కొన్ని సవరింపుల అక్కరవుతాయని అనిపిస్తూ ఉన్నది.
    మచ్చుకి,
    "నవ్యధోరణులు - కొత్తపుంతలు" అన్నారొకచోట, మొదటిమాటలు సరిపోయినా, "ధోరణి", పుంత ఒకటి కావు కదా..! "కొత్తపోకడలు" అనే దగ్గరగా ఉండవచ్చును. "పుంత" అనేది ప్రదేశానికి సంబంధించినది.

    "తిరునాళ్లు" అంటే పవిత్రమైన దినాలు, అందువల్ల బ్రహ్మోత్సవాలే కానక్కరలేదు.

    "పాడి" అంటే "ధర్మం" అని తెల్లం అనుకుంటున్నాను. (మచ్చుకి, "ఇది మీకు పాడియేనా..?" = "ఇది మీకు ధర్మమేనా..?"). అయితే, "పడి" అనే మాట కాకుండా, "పడికట్టు" మాట మొత్తంగా మాత్రమే "ప్రామాణికం"ని సరిపోలుతుందని నా ఉద్దేశ్యం.

    అలాగే, "పఠనం = చదువు" అని ఇప్పుడున్న వాడుక, "అధ్యయనం"కి మరో మాట తయారుచేసుకుంటే బాగుంటుందని నా అనుకోలు. అధ్యయనం = అధి + అయనం. ఈ "అయనం" అంటే ఏంటో చూడగలిగితే, కొంత సులువవ్వవచ్చు.
    ఇహపోతే, "సంగతి"కూడా సంస్కృతమే కదా..?

    అన్నట్టు, నేను తెలుగుకోసం ఓ బ్లాగుని మొదలుపెట్టాను. ఓ సారి ఇటు వైపు కూడా రండి.
    http://telugu125research.blogspot.in/

    ఉంటాను

    ReplyDelete
    Replies
    1. ఆ యా కాలాలకు తగ్గట్టు ప్రామాణికము అయినది "ధర్మం" అలా చూసిన "పాడి" అనేది ప్రామణికానికి తూగే పలుకే. మిగతా సంగతులు మీతో అంగీకరిస్తాను. మీ బ్లాగు బాగుంది. సమయం దొరికినప్పుడు రాస్తూ ఉండండి

      Delete
  2. synchronization, toggle కి తెలుగు పదాలు సూచించగలరు...

    ReplyDelete
    Replies
    1. షన్ముఖం గారు మీరు ముందుగా గమనించాల్సింది నేను తెలుగు నుడి పండితుడిని కాను. మెడికలు దాక్టరుని. మన చెడు రాత ఏమిటి అంటే మీరు ఈ అడకలను వారిని అడిగితే తెలుగు పలుకులకు బదులు సంస్క్రుతపు మాతలను తెచ్చి తెలుగుగా చెబుతారు. నూటికి 95 మంది తెలుగు పండితులకు యెది తెలుగో యేది సంస్క్రుతమో తెలియదు. కాబట్టి నుడిని గురించి పండితులు కాని వారు మాటడాలసి వస్తుంది. ఆయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను synchronization కి "పొత్తిక" అని వాడవచ్చు. గతంలో నేను రాసిన నిద్ర పుస్తకములో "లయ కలుపు" అని రాసాను. మరు అచ్చులో దానిని పొత్తిక అనే వాడుతాను. మరో పలుకు అయిన toggle కి తెలుగు గా "నిలమ మార్పు" (change of physical state) సరి పోతుంది.

      Delete
  3. thiru nallu,ullam - ivi tamila padalu kadaandi?

    ReplyDelete