25-8-2012
పిల్లల్లో మనసు, మేను, భాష ఎదుగుదలకు తోడ్పడాల్సిన ‘ముందు బడి’(Pre School or Nursery) కూడా పిల్లలను బట్టీ పెట్టించటానికి ముందస్తు (Pilot) కార్యక్రమంగా మారింది. అంటే ఎగువ తరగతుల్లో ఎలాగూ బట్టీ ద్వారానే కొనసాగాలి కాబట్టి ‘ముందు బడి’లో కూడా తరగతి గది, బోధన, హోం-వర్కులు, పరీక్షలు, ర్యాంకులు వచ్చి చేరి పోయాయి. కాకుంటే కాస్త తేలిగ్గా ఉంటాయి. అంటే మునుముందు పిల్లలు బట్టీ పెట్టటానికి కావాల్సిన ‘మనసు మూస’ను తయారు చేయటమే గురిగా ముందు బడి మారి పోయింది.
తొలి చదువులను పరాయి (ఇంగ్లీషు) భాషలో చెప్పటం శాస్ర్తియం కాదని పరిశోధనలు అన్నీ కోడి అయ కూస్తున్నా, సంపన్న వర్గం, దాన్ని అనుసరించే నడిమి, దిగువ తరగతి వర్గాల దన్నుతో విద్యా వ్యవస్థ మొండిగా అటు వయిపే పోతున్నది. అశాస్ర్తియ పద్ధతిలో చదువు సాగినప్పుడు దాని వల్ల వచ్చే ఫలితాలు కూడా అశాస్ర్తియంగానే ఉంటాయ. కానీ బయటకు అలా కనపడటంలేదు. అంతా బాగున్నట్టు కనిపించే ఆ ఫలితాలలో ఉన్నది చాలావరకు డొల్లతనమే. బాగున్నట్టు కనిపించటానికి కారణం కూడా పిల్లల్లో ఉన్న బట్టీ పెట్టగల చేవ వల్లనే.
పిల్లల్లో మనసు, మేను, భాష ఎదుగుదలకు తోడ్పడాల్సిన ‘ముందు బడి’ కూడా పిల్లలను బట్టీ పెట్టించటానికి ‘పయిలెట్’ కార్యక్రమంగా మారింది. అంటే ఎగువ తరగతుల్లో ఎలాగూ బట్టీ ద్వారానే కొనసాగాలి కాబట్టి ‘ముందు బడి’లో కూడా తరగతి గది, బోధన, హోంవర్కులు, పరీక్షలు, ర్యాంకులు వచ్చి చేరిపోయాయి. కాకుంటే కాస్త తేలిగ్గా ఉంటాయి. అంటే మునుముందు పిల్లలు బట్టీ పెట్టటానికి కావాల్సిన ‘మనసు మూస’ను తయారుచేయటమే గురిగా ముందు బడి మారిపోయింది.
పిల్లలకు అనుకరణ శక్తి చాలా ఎక్కువ. మనం నేర్పిన ప్రతిదాన్ని అర్థం తెలియకపోయినా దాన్ని అలాగే తిరిగి ఒప్పచెబుతారు. ఈ సూత్రానే్న బట్టీవిద్యకు పునాదిగా ఉపయోగపడుతుంది. ఎలానో చూద్దాం.
పేరు ప్రఖ్యాతులు ఉన్న కార్పోరేటు బడుల్లో చదివే తెలివిగల పిల్లల్ని ‘‘హాట్‌క్రాస్ బన్స్’’ గేయాన్ని చెప్పమనండి. ఆ గేయం ఇలా ఉంటుంది. ‘‘హాట్ క్రాస్ బన్స్ / హాట్ క్రాస్ బన్స్ / వన్ ఏ పెన్ని /టూ ఏ పెన్ని/ హాట్‌క్రాస్ బన్స్’’. పిల్లలు చెప్పిన తరువాత ఈ గేయానికి అర్థం ఏమిటో వారిని అడగండి. దాదాపు చెప్పలేరు. ఎక్కువ మంది పిల్లలు అర్థం తెలియదని నేరుగా చెప్పరు. చెప్పమని మనం బలవంతం చేస్తే ముడుచుకుపోతారు. చెప్పలేకపోయినందుకు రెండోసారి మీరు పిలిస్తే మీ దగ్గరకు రారు.
‘‘హట్‌క్రాస్ బన్స్’’ గేయాన్ని పిల్లలు చెప్పటానికి అయితే గడ గడా చెప్పేస్తారు. ఈ గేయం పిల్లల చెవికి ఇంపుగా, లయగా ఉండే సవ్వడి మాత్రమే. దాన్ని అలాగే ఒప్పచెబుతారు. అందులోని పదాలకు అర్థాలు కానీ, వాటి మేనుక (్ఫజికల్) రూపాలు కానీ వాళ్ల మెదళ్లలో ఉండవు. ఎందుకంటే అందులోని సంగతులు మన పరిసరాలకు, సంస్కృతికి చెందినవి కావు. పిల్లల రోజువారీ జీవితంలో ఈ పదాలు ఎక్కడా తారసపడవు.
‘హాట్‌క్రాస్ బన్’ అంటే క్రయిస్తవులు ‘గుడ్‌ఫ్రైడే’ నాడు చేసుకొని తినే రొట్టె. పండగ ప్రత్యేకంగా దానిపైన శిలువ గుర్తు వేస్తారు. ఇంగ్లాండులో ‘గుడ్‌ఫ్రైడే’ సమయంలో వీధుల్లో అరచుకుంటూ రొట్టెల్ని అమ్ముకొనేవారిని నేపథ్యంగా తీసుకొని రాసిన గేయం ఇది. దీని భావం వివరించి చెబితే కాని మన పిల్లలకు అర్థం కాదు. ‘వన్ ఏ పెన్ని, టు ఏ పెన్ని’లలో ఈ ‘పెన్ని’ అనేది ఏమిటో చంటిబుర్రలకు ఎక్కదు. పెన్ని అనేది బ్రిటీషు వాళ్ళ నాణెం. దాని గురించి మన పిల్లలకు తెలియదు.
ఈ ‘హాట్‌క్రాస్ బన్స్’ గేయంలో ఉన్న ప్రతీ పదం బ్రిటీషు సమాజపు సంస్కృతినుండి, వాళ్ళ పిల్లల కోసం రాసింది. పేరుకి ఇంగ్లీషు గేయమే అయినా బహుశా ఇది అమెరికా పిల్లలకు కూడా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది అమెరికా సంస్కృతికి కూడా సంబంధం లేనిది. అమెరికాలో బిడ్డలకు డాలర్లు, సెంట్లు అంటేనే తెలుసు. మన బిడ్డలకు రూపాయలు, పైసలంటేనే తెలుసు. కాబట్టి ఈ గేయంలో ఒక్క ముక్క కూడా పిల్లల బుర్రల్లో దూరే అవకాశమే లేదు. ఇదే పిల్లలకు ‘చుకు చుకు రైలు వస్తుంది’’ అడిగి చెప్పించుకోండి. ఆ గేయం ఇలా ఉంటుంది. ‘‘చుకు చుకు రైలూ వస్తుందీ / దూరం దూరం జరగండీ/ ఆగినాక ఎక్కండీ/ జోజో పాప ఏడవకూ / లడ్డూ మిఠాయి కొనిపెడతా/ కమ్మని పాలు తాగిస్తా’’. ఒకవేళ ఈ గేయం పిల్లలకు రాకపోతే మీరే లయబద్ధంగా, ఇంకా వీలు అయితే అభినయంతో పాడి వినిపించండి. వాళ్ళలో ఆసక్తినీ, ముఖంలో మార్పును గమనించండి. అలా నాలుగు అయిదు సార్లు చెప్పగానే ఇక వాళ్ళే తిరిగి చెప్పటం మొదలుపెడతారు. ఆ రకంగా అది పిల్లల నోళ్ళలో నానుతూ ఉంటుంది.
‘‘చుకు చుకు రైలు’’ గేయం తెలుగులో ఉంది. దానిలోని పదాలు అన్నీ పిల్లలకు తెలిసినవే. రైలు ఇంగ్లీషు పదం అయినా తెలుగు నుడికారంలో ఇమిడిపోయి ఉంది. దూరం - జరగటం- ఆగటం- ఎక్కటం- జోజో (అంటే జోకొట్టటం అని చెప్పకుండానే అర్థం అవుతుంది)- పాప- ఏడవటం.. ఈ పదాలు అన్ని పిల్లలకు మనం చెప్పకుండానే అర్థం అవుతాయి. ఆ పదాల మేనుక రూపాలు పిల్లల బుర్రల్లో ముందుగానే ముద్రపడి ఉంటాయి. అందువల్ల ఆ గేయాన్ని మొత్తంగా మనసులోకి తీసుకుంటారు. అలా తీసుకున్న వాటితోనే మనసు ఎదుగుతుంది.
No comments:
Post a Comment